Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు!

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

New Update
Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు!

Rain Alert To Telangana: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను ప్రకటించామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా?

53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో దెబ్బతిన్న నివాస గృహాలు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: KCR Vs Revanth: ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రేవంత్‌తో యుద్ధమే?

Advertisment
Advertisment
తాజా కథనాలు