MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
New Update

Rakesh Reddy With RTV Sensational Interview : మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ కు మధ్య కాంప్రమైజ్ చేశాడని బీజేపీ (BJP) ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మేఘా కంపెనీకి ఒక శాపంలా మారిందన్నారు. ఆర్టీవీకి పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణలో మేఘా సంస్థ దోపిడితో పాటు అనేక తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుంటున్న మేఘా కష్ణారెడ్డిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే తాను బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఏ అవకాశం వచ్చినా మేఘా అవినీతిపై గొంతెత్తుతున్నానన్నారు.

రేవంత్ రెడ్డి పాలనలో ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు రాకేష్ రెడ్డి. తన ఆర్మూర్ నియోజకవర్గానికి రేవంత్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన కొడంగల్ నియోజకవర్గానికి రూ.6 వేల కోట్లు తీసుకెళ్లాడన్నారు. ప్రాంతాల మధ్య ఇలానే వివక్ష కొనసాగితే ఉత్తర తెలంగాణలో మరో ఉద్యమం వస్తుందన్నారు. రాకేష్‌ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read : పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్!

#telangana #megha-krishna-reddy #rtv-exclusive-interview #paidi-rakesh-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి