BIG BREAKING: అక్కడి నుంచి పోటీ చేస్తా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా.. షర్మిల సంచలన ప్రకటన! తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు. By Trinath 12 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి YS Sharmila: తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల సంచలన ప్రకటన చేశారు. అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి(YS SHARMILA) అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు షర్మిలా. బి ఫామ్ ల కోసం ధరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి ఏం అన్నారంటే? ➼ 119 నియోజక వర్గాల్లో YSRTP పోటీ చేస్తుంది. ➼ 119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తాం. ➼ బి ఫామ్ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు. ➼ నేను పాలేరు నుంచి పోటీ చేస్తా. ➼ రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది. ➼ బ్రదర్ అనిల్,విజయమ్మ గారిని కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉంది. ➼ అవసరం అయితే అనిల్ గారు పోటీ చేస్తారు.విజయమ్మ గారు సైతం పోటీ చేస్తారు. ➼ కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం. ➼ ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నాం. ➼ ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం. ➼ అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపాం. ➼ 4 నెలలు ఎదురు చూశాం. ➼ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తాం. ఇక కాంగ్రెస్‌తో వీలినం లేనట్టే! షర్మిల తాజా ప్రకటనతో ఇక YSRTP కాంగ్రెస్‌తో వీలినం లేనట్టేనని అర్థమైపోయింది. నిజానికి కాంగ్రెస్‌తో కలిసి నడవాలని షర్మిల భావించారు. అయితే సీట్ల విషయంలో జరిగిన కొన్ని పరిణామాల తర్వాత షర్మిల బ్యాక్ స్టెప్ వేశారు. ఓట్లు చీలిస్తే కేపీఆర్ సీఎం అవుతారని కాంగ్రెస్‌తో కలవాలని అనుకున్నట్టు షర్మిల అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చాలా నెలల పాటు దీనిపై సస్పెన్స్ కొనసాగింది. చివరకు ఒంటరిగానే పోటి చేయాలని షర్మిల ఫిక్స్ అయ్యారు. ఇక తన భర్త బ్రదర్ అనిల్, విజయమ్మని కూడా పోటీలో నిలబెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో షిర్మల ఒంటరి పోటి చేస్తుండడంతో ఎవరి ఓట్లు చీలుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. షర్మిల పార్టీ సోలోగా పోటి చేస్తే కేసీఆర్ పార్టీకి పడే ఓట్లే చీలుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి షర్మిల పార్టీ సింగిల్‌గా పోటి చేస్తుండడంతో ఫైనల్ రిజల్ట్ నంబర్స్ కచ్చితంగా ప్రభావితం అవుతాయని అర్థమవుతోంది. ALSO READ: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే? #ys-sharmila #telangana-election-2023 #ysrtp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి