/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/abvp-jhansi-incident-jpg.webp)
Telangana Police Suspended Police Women : రాజేంద్రనగర్(Rajendra Nagar) లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత బుధవారం ఏబీవీపీ(ABVP) రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టుకుని లాగిన పోలీసులపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అన్నివైపుల నుంచి వచ్చింది. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నిర్మాణానికి యూనివర్శిటీ స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తున్న ఝాన్సీ(Jhansi) ని స్కూటర్ పై ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగడంతో ఆమె రోడ్డుపై పడి గాయాలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
సస్పెండ్:
ఇక ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గత గురువారం పోలీసులను నివేదిక కోరింది. ఈ ఘటనను పరిగణలోకి తీసుకుని ఇద్దరు పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడం.. మహిళా కానిస్టేబుల్ చేసింది తప్పేనని నిర్ధారణకు రావడంతో సీసీ చర్యలకు దిగారు. ఝాన్సీ జుట్టు లాగిన మహిళా కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు.
Also Read : లంచగొండి పోలీస్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన హెడ్ కానిస్టేబుల్
అసలేం జరిగింది?
జయశంకర్ వర్సిటీలో పోలీసుల తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకున్న ఓ మహిళ కానిస్టేబుల్ ఆమెను కింద పడేసింది. టూ వీలర్‌పై వెళ్తూ రోడ్డుపై పరుగెడుతున్న ఝాన్సీ జుట్టుపట్టుకుని లాగింది కానిస్టేబుల్. దీంతో ఝాన్సీ కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడంపై విద్యార్థుల నిరసన చెబుతుండగా ఈ ఘటన జరిగింది. జీవో నెంబర్ 55 రద్దు చేయాలన్న డిమాండ్‌ను ఏబీవీపీ బలంగా వినిపిస్తోంది. ఓవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. పోలీసుల దౌర్జన్యాలు… అక్రమ కేసులు… అవహేళనలు కొత్తమీ కాదన్న కవిత.. ఇదే కాంగ్రెస్ మీద, ఇదే పోలీసుల మీద కొట్లాడి వచ్చినోళ్లమన్నారు. తెలంగాణ తెచ్చినోళ్లమని.. కొట్లాడేందుకు రెడీగా ఉన్నామంటూ వ్యాఖ్యలు చేశారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు
WATCH: