తెలంగాణ ఎన్నికలు దగ్గరపడటంతో అనేక చోట్ల నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్రంలో రూ.14,23,35,620 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రూ.6,51,03,561 నగదు, రూ.2,13,60,112 విలువైన మద్యం, రూ.1,79,69,125 విలువైన మత్తుమందులు, రూ.2,53,97,322 కోట్ల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.1,25,05,500 కోట్ల విలువైన చీరలు, ఇతర ఆభరణాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పట్టుబడ్డ మొత్తం రూ.698,89,84,122కు చేరింది.
Also read: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతుబంధు.. సర్కార్ కీలక నిర్ణయం!
మరోవైపు నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. రోజుకో ప్రాంతం తిరుగుతూ ప్రజల వరాల జల్లులు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఇక నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. డిసెంబర్ 3 మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అయితే తెలంగాణలో మళ్లీ ఏ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also read: భార్య మాట వినట్లేదని మామను చంపిన అల్లుడు.. తర్వాత బామర్ది ఏం చేశాడంటే