Telangana Constable Results: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. రిజల్ట్స్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది టీఎస్‌ఎల్‌పీఆర్‌బి. గురువారం ఉదయం కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది పోలిస్ నియామక బోర్డు(TSLPRB) పలు విభాగాల్లో 16,604 పోస్టులకు గానూ 15,750 మంది సెలక్ట్ అయినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బి ప్రకటించింది. పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5 ఉదయం ప్రకటించడం జరుగుతుందని, అభ్యర్థులు తమ ఫలితాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని TSLPRB ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపోతే.. కోర్టులో కేసుల కారణంగా పలు పోస్టులకు ఫలితాలను విడుదల చేయలేదని తెలిపింది పోలిస్ నియామక బోర్డు. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది. అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం ఈ తుది ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది.
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read:
Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన..
Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?