TS Police: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!

తెలంగాణలో మరో సారి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లను ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న చలాన్లకు 90 శాతం డిస్కౌంట్, టూ వీలర్స్ కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60, భారీ వాహనాలపై ఉన్న చలానాలకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

New Update
Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా

తెలంగాణ పోలీసులు (Telangana Police) వాహనాదారులకు మరో సారి అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్ చలానాలపై డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లపై రాయితీ అమల్లోకి ఉంటుంది. ఆ తేదీల్లోపు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది.
ఇది కూడా చదవండి:New Year 2024: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ కఠిన ఆంక్షలు.. వారికి హెచ్చరికలు!

-ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న చలాన్లకు 90 శాతం డిస్కౌంట్

- టూ వీలర్స్ కు 80 శాతం

- ఫోర్ వీలర్స్, ఆటోలకు 60

- భారీ వాహనాలకు 50 శాతం

వాహనదారులు ఈ చలాన్లను డిస్కౌంట్ తో ఆన్లైన్ లేదా మీసేవ సెంటర్లలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. 2022 మార్చిలోనూ చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చి వసూలు చేశారు పోలీసులు. ఆ సమయంలో మొత్తం రూ.300 కోట్లు వసూలవడం విశేషం. అయితే.. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు మళ్లీ డబ్బులు వసూలు కాలేదు. ప్రస్తుతం 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా చలాన్లను క్లీయర్ చేయడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది పోలీస్ శాఖ.

Advertisment
తాజా కథనాలు