Telangana : 18ఏళ్లుగా జైల్లో మగ్గిన వైనం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తిరిగిరాక.. అసలేమైందంటే?

తెలంగాణ నుంచి దుబాయ్ కి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు అక్కడ ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో 18 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ని ఆశ్రయించగా వారి చొరవతో కొద్ది రోజుల క్రితం విడుదల అయ్యారు.

New Update
Telangana : 18ఏళ్లుగా జైల్లో మగ్గిన వైనం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తిరిగిరాక.. అసలేమైందంటే?

Rajanna Sircilla : రాజన్న సిరిసిల్లా(Rajanna Sircilla) జిల్లాలోని చందుర్తి మండలానికి చెందిన గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దం(Bahadur Singh) డుగుల లక్ష్మణ్ 18 సంవత్సరాల క్రితం దుబాయ్(Dubai) కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం వీరు నివాసం ఉండే ప్రదేశంలో నేపాల్(Nepal) కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్ మెన్‌ హత్యకు గురయ్యాడు.

అక్కడే పని చేస్తున్న ఈ ఐదుగురు ఆ హత్య కేసులో ఇరుక్కున్నారు భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ నేరం రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు.

నేపాల్ లో బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో  క్షమాభిక్ష పై సంతకాలు  చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్(KTR)  పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది.

Also Read : మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి..

సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ  కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు. దీంతో సుమారు 18 సంవత్సరాల తరువాత ఆ ఐదుగురు రోజుల తేడాతో స్వదేశానికి చేరుకున్నారు.

ముందుగా హైదరాబాద్(Hyderabad) చేరుకుని అక్కడ నుంచి సొంత గ్రామానికి రావడంతో కుటుంబ సభ్యులు వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. భాష రాని కారణంగా చేయని నేరానికి 18 సంవత్సరాలు దుబాయ్‌ జైళ్ల గోడల మధ్య జీవచ్చావాలుగా బతికిన బాధితులు తమ భార్య బిడ్డలు, తల్లిదండ్రులను చూడగానే భోరున విలపించారు.

జైల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటామాని బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు.

Also Read : కృష్ణుడిగా రాహుల్‌ గాంధీ.. అర్జునుడిగా అజయ్‌ రాయ్..కాన్పూర్‌ లో వెలిసిన పోస్టర్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు