Telangana: భద్రత ఇస్తారా? కోర్టుకెళ్లాలా?.. తెలంగాణ డీజీపీకి రేవంత్ వార్నింగ్! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు 6+6 భద్రత కల్పించాలని కోరారు. లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తామంటూ హెచ్చరించారు. By Shiva.K 03 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Reddy Letter to Telangana DGP: తన భద్రత విషయంపై ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ డీజీపీకి(Telangana DGP) లేఖ రాశారు. తనకు భద్రత కల్పించడం లేదంటూ డీజీపికి గుర్తు చేశారు. ఎన్నికల ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు(High Court) చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్. దీనికి తోడుగా గత జులైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెనక్కి తీసుకున్నారన్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు రేవంత్ రెడ్డి. లేదంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. కాగా, గతంలో రేవంత్ రెడ్డి యాత్ర సందర్భంగా సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆదేశించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ రేవంత్‌కు సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తెలంగాణ డీజీపీకి రేవంత్ రెడ్డి రాసిన లేఖ ఇదే.. Also Read: ఫేక్ ప్రామిస్‌లకు కేరాఫ్ కాంగ్రెస్.. ఆర్టీవీ స్టోరీని ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ #tpcc-chief #revanth-reddy #telangana-dgp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి