Etala Rajender: మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ వన్.. ఈటల సెటైర్లు సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి మద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందన్నారు. By Karthik 21 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు చేపట్టిన ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర 50 రోజులకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. కొత్త హామీలను ఇవ్వబోతున్నారని ఆరోపించారు. సీఎం కొత్త హామీలు ఇస్తే.. గత హామీలపై సీఎంను, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రశ్నించాలని ఆయన సూచించారు. గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన వాటిలో డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇస్తామని యువకులను మోసం చేశారని మండిపడ్డారు. దీంతోపాటు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తామని కేసీఆర్ హామి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ హామీలను సీఎం ఎందకు నెరవేర్చలేక పోయారని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ రౌడీలని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. కేసీఆర్ ఇప్పుడు కూడా వారికే టికెట్లు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చే హామీలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాని సూచించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. #etala-rajender #vaddepalli-rajeswara-rao #bjp #brs #kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి