Telangana News: ఓయూలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారయత్నం

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్య కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. బయటకు అడుగుపెడితే ఎలాంటి సమస్య వస్తుందని భయం ఎక్కువైపోతుంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఘటన కలకలం రేపుతోంది.

New Update
Telangana News: ఓయూలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారయత్నం

ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో చదువుకుంటున్న విద్యార్థినిపై అత్యచారయత్నం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆగ్రహించిన క్యాంపస్ విద్యార్థులు వీసీ క్యాంపస్ ఎదుట తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీలో ఎంఏ కోర్స్ చేస్తున్న విద్యార్థినిపై ఈనెల 18వ తేదీన అంటే బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యువతిని అడ్డగించారు. ఆమెపై అత్యాచార యత్నం చేశారు. దాంతో యువతి వారిని ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో.. నిందితులు పారిపోయారు. విషయాన్ని తన సహ విద్యార్థులకు తెలియజేయగా.. వారితో కలిసి వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని బరోసా సెంటర్‌కు తరలించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఓయూ పోలీసులు దర్యాప్తు చేసి రిపోర్టు తెప్పించుకుకున్నారు.

ఇది కూడా చదవండి: చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు… పోటెత్తిన భక్తజనం

కాగా.. ఘనటపై ఆగ్రహించిన క్యాంపస్‌ విద్యార్థులు (Students ).. అమ్మాయిలకు క్యాంపస్‌లో రక్షణ కరువైందని ఇఫ్లూ(EFLU) వీసీ ప్రొఫెసర్ సురేష్ ఛాంబర్ (VC Prof. Suresh Chamber) దగ్గర నినాదాలు చేశారు. ప్రొఫెసర్ సురేష్ కుమార్‌ బయటకు రాకుండా విద్యార్థులు ముట్టడించారు. రాత్రి అంతా వీసీ చాంబర్ వద్దే బైఠాయించిన విద్యార్థులు.. వీసీ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య తెల్లవారుజామున 3 గంటలకు వీసీని క్యాంపస్ నుంచి బయటికి తీసుకువచ్చారు. అయితే, విద్యార్థినికి న్యాయం చేయాలని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని స్టూడెంట్స్ డిమాండ్‌ చేశారు.

అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం..

క్యాంపస్‌లో బయటి వ్యక్తులు ఎవరు రాకుండా సెక్యూరిటీతో పాటు, గేట్లు మూసి ఉంటాయని క్యాంపస్‌ అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థులు మాత్రం అదంతా అబద్దం అని కొట్టిపారేస్తున్నారు. ఇఫ్లూ క్యాంపస్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ వరకు ఇఫ్లూకి సెలవు ప్రకటించారు అధికారులు. సెలవుల ప్రకటన కూడా విద్యార్థులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఆకస్మికంగా సెలవులు ప్రకటించడంతో.. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్‌లో విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేయడంతో విద్యార్థుల కష్టాలు అంతా ఇంతా కావు. ఈ వివాదంపై తెలుసుకునేందుకు వెళ్తున్న మీడియాను కూడా అధికారులు లోనికి రానివ్వడం లేదు.

ఇది కూడా చదవండి:  నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన క్రికెటర్లు..కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు