BIG BREAKING: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫిక్స్ చేసిన కాంగ్రెస్!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఈ ఎన్నికకు నామినేషన్లకు గడువు ముగియనుంది.

New Update
BIG BREAKING: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫిక్స్ చేసిన కాంగ్రెస్!

MLA MLC Elections: ఎమ్మెల్యే కోటా అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్‌ పేరు తెచ్చి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండడంతో నామినేషన్ కి సిద్దం అవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.

అద్దంకికి హ్యాండ్..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. ఆయన స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మందుల సామేల్‌ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డారు అద్దంకి దయాకర్. ఎమ్మెల్యే టికెట్ కాకుండా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని గతంలో కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్ ను ఢిల్లీకి పిలిపించుకొని హామీ ఇచ్చింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పై ఘన విజయం సాధించింది తెలంగాణ గడ్డపై మూడు రంగుల జెండాను ఎగరవేసింది. తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మందుల సామేల్‌ 50వేల మెజారితో గెలుపొందారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ పగ్గాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ కు ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అద్దంకికి త్వరలో మంత్రి పదవి కూడా వస్తుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.

బల్మూరికి భలే.. 

NSUI లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే.. వెంకట్ కు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ కేటాయించలేదు. తాజాగా బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

గతంలో జరిగిన ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు బల్మూరి వెంకట్. ఆ ఎన్నికల్లో బల్మూరి వెంకట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఓటమి చెందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు