Telangana: ఆరు గ్యారెంటీలకు ఇలా అప్లై చేసుకోండి.. క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఆరు గ్యారెంటీల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. అర్హులందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. దరఖాస్తులకు ఎలాంటి రుసుము అవసరం లేదన్నారు. By Shiva.K 26 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress 6 Guarantees: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ఎప్పుడు అమలు చెస్తారా? ఎలా అమలు చేస్తారా? అప్లికేషన్ ఎలా? అని ఆందోళనకు గురవుతున్నారు జనాలు. ఈ క్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక అప్‌డేట్ ఇచ్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో 150 వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. అర్హులందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. 6 గ్యారంటీలకు ప్రభుత్వమే దరఖాస్తులు ఉచితంగా ఇస్తుందన్నారు మంత్రి. దరఖాస్తులకు ఎలాంటి రుసుము అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. దరఖాస్తులు పూర్తి చేయలేని వారి కోసం వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం తెలిపారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. వార్డు, గ్రామంలో ప్రజాపాలన రోజున ఎవరైనా అందుబాటులో లేకపోతే.. 6వ తేదీలోపు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు మంత్రి. ఈ పథకాల విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం ఉండదని మంత్రి తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Also Read: అమ్మ కి’లేడీ’.. మాజీ ప్రియుడిపై పగతో మైండ్ బ్లాంక్ స్కెచ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..! ఆయన సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. #telangana #telangana-government #6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి