Forest Collapse: ములుగు జిల్లాల్లో ఇటీవల భారీ గాలులకు పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయిన విషయం తెలిసిందే. నాలుగురోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలో తాడ్వాయి-మేడారం మధ్యలో ఉన్న అడవిలో దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా అరుదైన చెట్లు నేలమట్టం అయ్యాయి. కేవలం రెండున్నర గంటల్లో పెనుగాలి చేసిన విధ్వంసంలో చెట్లన్నీ నేలకొరిగాయి. ఈ విషయంపై ఇప్పటికే అక్కడి అటవీశాఖాధికారులు విచారణ చేపట్టారు. గాలులు వీచిన విధానంపై.. జరిగిన విధ్వంసంపై వారు రీసెర్చ్ చేస్తున్నారు. దీనికోసం వారు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం కూడా తీసుకుంటున్నారు.
Forest Collapse: ఇదిలా ఉంటే.. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీ ఎఫ్ ఓలతో టెలిఫోన్లో సీతక్క మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఈ ఘటనకు కేవలం రెండు రోజుల ముందే ములుగులో ఆప్రాంతాన్ని మంత్రి సందర్సించారు. ఈలోగా ఇలా ఇన్ని వేల చెట్లు నెలకొరగడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తానెన్నడూ అడవిలో ఈ స్థాయిలో విధ్వంసం చూడలేదని మంత్రి సీతక్క అన్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. “ ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయి. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాము. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఈరోజు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తారు” అని చెప్పారు.
Forest Collapse: అంతేకాకుండా.. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అదే ఇటువంటి సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంశం జరిగేదని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క-సారక్కల దయవల్లనే ఎటువంటి పెను విపత్తు చోటు చేసుకోలేదని చెప్పారు. ఆ తల్లుల దీవెనతోనే ప్రజలు సురక్షితంగా బయటపడగలిగారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి అని సీతక్క కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అటవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలనీ ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే..
Forest Collapse: రెండు వందల హెక్టార్లలో రెండు కిలోమీటర్ల లైన్ లో దాడ్పు 50 వేల చెట్లు పడిపోయాయి. అత్యంత వింత గొలుపుతున్న ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గరలోని తాడ్వాయి -మేడారం గ్రామాల మధ్య జరిగింది. ఈ చెట్లు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్నకు అటవీశాఖ అధికారులు ఉలిక్కి పడి సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు.
Forest Collapse: ములుగు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ ఆగస్టు 31 సాయంత్రం 5:30 - 7:30 గంటల మధ్యలో తాడ్వాయి-మేడారం రోడ్డులోని దాదాపు 50 వేల అరుదైన జాతుల చెట్లు పడిపోయినట్లు వెల్లడించారు. వీటిలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లు ఉన్నాయి. ఇలా ఒక్కసారిగా చెట్లు పడిపోవడానికి కారణం ఏమిటో తెలియరాలేదని రాహుల్ జాదవ్ చెప్పినట్టు ఒక మీడియా కథనం పేర్కొంది.
అయితే , అధికారులు మాత్రం ప్రత్యేక పరిస్థితులలో ఇలా జరగవచ్చని చెబుతున్నారు . అకస్మాత్తుగా వచ్చే టర్నడోలు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు తీసుకువస్తాయని.. వాటి ప్రభావముతో ఇలా తక్కువ వయసు ఉన్న చెట్లు పడిపోయే అవకాశం ఉందనీ అంటున్నారు . అయితే , అటవీశాఖ అధికారులు మాత్రం అలాంటి గాలులు వచ్చాయి అనే విషయాన్ని నిర్ధారించలేదు.
Also Read : శ్రీశైలం పవర్ హౌస్‌లో పేలుడు!