Forest Collapse: ములుగు జిల్లాల్లో ఇటీవల భారీ గాలులకు పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయిన విషయం తెలిసిందే. నాలుగురోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలో తాడ్వాయి-మేడారం మధ్యలో ఉన్న అడవిలో దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా అరుదైన చెట్లు నేలమట్టం అయ్యాయి. కేవలం రెండున్నర గంటల్లో పెనుగాలి చేసిన విధ్వంసంలో చెట్లన్నీ నేలకొరిగాయి. ఈ విషయంపై ఇప్పటికే అక్కడి అటవీశాఖాధికారులు విచారణ చేపట్టారు. గాలులు వీచిన విధానంపై.. జరిగిన విధ్వంసంపై వారు రీసెర్చ్ చేస్తున్నారు. దీనికోసం వారు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం కూడా తీసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Forest Collapse: సమ్మక్క-సారక్కల దయతోనే పెద్ద ముప్పు తప్పింది.. చెట్లు కూలిన సంఘటనపై మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో ఇటీవల వచ్చిన పెను గాలుల్లో తాడ్వాయి-మేడారం అడవుల్లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఈ విధ్వంసంపై మంత్రి సీతక్క స్పందించారు. జరిగిన సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. అక్కడి వనదేవతలు సమ్మక్క సారక్కల దయతోనే పెను విధ్వంసం తప్పిందని ఆమె వ్యాఖ్యానించారు.
Translate this News: