Telangana Elections: 'బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం'.. కాంగ్రెస్‌ను ఆడుకున్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. విభజన హామీలపై రాహుల్ ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రపై ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ హక్కులపై ఎన్డీయేను ఏనాడూ ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. By Shiva.K 19 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Minister KTR Comments on Rahul Gandhi: కాంగ్రెస్ బస్సు యాత్ర (Congress Bus Yatra) తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్(Minister KTR). విభజన హామీలపై రాహుల్(Rahul Gandhi) ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రపై ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ హక్కులపై ఎన్డీయేను ఏనాడూ ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. నిన్నైనా.. నేడైనా.. రేపైనా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని మండిపడ్డారు కేటీఆర్. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీల్ని 100రోజుల్లో బొంద పెట్టిన పార్టీ కాంగ్రెస్ అయితే.. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌పై సెటైర్లు వేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం యధావిధిగా.. Also Read: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్.. కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయం.. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో..గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు.. కరప్షన్ కు కేరాఫ్.. కాంగ్రెస్. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు.. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం. నిన్న అయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు.. రేవంతు.. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది.. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు.. జై తెలంగాణ జై కేసిఆర్ జై బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం... సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ… — KTR (@KTRBRS) October 19, 2023 Also Read: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. #telangana-elections-2023 #minister-ktr #congress-party #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి