Telangana: 'వారిని బూటుతో కొట్టాలి' అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. ఎన్నికల నేపథ్యంలో కొందరు విపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు చెప్పుతో కొట్టాలని చేసిన కామెంట్స్‌ని ఉటంకించిన మంత్రి.. వారిని బూటుతో కొట్టాలని తాను అనగలనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాకపోతే సంస్కారం అడ్డొస్తోందన్నారు. By Shiva.K 15 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్(CM KCR) లక్ష్యంగా తీవ్ర పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు విపక్ష నేతలు. వారి వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు అంతే ఘాటుగా స్పందించారు. 'చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నాడు. మేమూ మాట్లాడగలం. బూటుతో కొట్టాలి అని నేను కూడా అనగలను. కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలి' అని అన్నారు మంత్రి హరీష్ రావు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన.. కాంగ్రెస్ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కర్ణాటక నుంచి డబ్బు, లిక్కర్, రాజకీయాల కోసం నాయకులు వస్తే.. తెలంగాణ నుంచి బియ్యం కర్ణాటకకు వెళ్తుందని అన్నారు. అదీ మన తెలంగాణ అంటూ గర్వంగా కాలర్ ఎత్తారు హరీష్ రావు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని అన్నారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి హరీష్ రావు తోసిపుచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ ఒక్కటి కాదని స్పష్టం చేశారు మంత్రి. తెలంగాణకు రావాల్సిన బిల్లులు ఆపారని, తమకు నిధులు రాకుండా చేశారని ఆరోపించారు మంత్రి. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని రూ. 35 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆపిందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. బీజేపీపై తాము పోరాటం చేస్తున్నామని, కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు మంత్రి హరీష్ రావు. Also Read: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు.. ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..! #telangana-elections-2023 #telangana-minister #minister-harish-rao #telangana-politics #telangana-finance-minister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి