Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కు షాక్.. మరో కీలక నేత రాజీనామా!

కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలోకి తీసుకుని మళ్లీ ఆయనకే టికెట్ ప్రకటించడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు.

New Update
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కు షాక్.. మరో కీలక నేత రాజీనామా!

Nandikanti Sridhar Resigns To Congress: మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanthrao) చేరికతో కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత నందికంటి శ్రీధర్ (Nandikanti Sreedhar) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కొద్ది సేపటి క్రితం లేఖ రాశారు. 1994 నుంచి నిజాయితీగా తాను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు శ్రీధర్‌. 2018లోనే తనకు కాంగ్రెస్ టికెట్ దక్కాల్సి ఉన్నా.. పొత్తుల్లో భాగంగా దక్కలేదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని ఆశించినట్లు చెప్పారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన మైనంపల్లి హన్మంతరావు ను పార్టీలోకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తనను కాదని మైనంపల్లి కుటుంబానికి ఏకంగా రెండు టికెట్లు ఇవ్వడానికి పార్టీ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్!

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు దక్కదన్న నిర్ణయానికి తాను వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు నందికంటి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్ తాను ఏ పార్టీలో చేరుతాన్న విషయాన్ని మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఆయన ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ దాదాపు కన్ఫామ్ అయ్యింది. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. బీజేపీలోనూ ఆ పార్టీ సీనియర్ నేత రామచందర్ రావు మరో సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నందికంటి శ్రీధర్ ఏ పార్టీలో చేరుతారు? ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న విషయం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఉత్కంఠగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు