Kothagudem : కాసేపట్లో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా కొత్తగూడెంలో జరగనున్న కాంగ్రెస్(Congress) జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట కొత్తగూడెంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు నాయకులు. సీఎం సభ నేపథ్యంలో కొత్తగూడెంలో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు పోలీసులు. ఇప్పటికే కొత్తగూడెంలో జేపీనడ్డా, కేసీఆర్ సభలు నిర్వహించారు. దీంతో కొత్తగూడెంపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇటీవల మహబూబాబాద్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ తాము ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లాను రద్దు చేయాలని ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. దీంతో ఈ అంశంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించే అవకాశం ఉంది. జిల్లాల రద్దుపై రేవంత్ క్లారిటీ ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపత్యంలో రేవంత్ స్పీచ్ పై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.