Harish rao: ఖమ్మంలో హై టెన్షన్.. హరీష్ రావుపై రాళ్ల దాడి!

ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబిత, పువ్వాడ, నామా కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది.

New Update
Harish rao: ఖమ్మంలో హై టెన్షన్.. హరీష్ రావుపై రాళ్ల దాడి!

Khammam: ఖమ్మంలో వరదల రాజకీయం హీటెక్కింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్ము మున్నేరు అతలాకుతలమవుతోంది. దీంతో ప్రభుత్వ అధికారులతోపాటు సీఎం రేవంత్ వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు బాధితులను పట్టించుకోకపోవడంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు.

దీంతో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్యనేతలు మున్నేరు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారి కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తుండగా.. ఈ దాడిలో నామా నాగేశ్వర రావు కారు పూర్తిగా ద్వంసమైంది.

ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్..ఇది ఖమ్మం కాంగ్రెస్ గుండాల దాడి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండింస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే మా తప్పా? ప్రజలకు సేవ చేయటం చేతకాదు. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే...ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమంటూ ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు