TS News : విషాదం నింపిన ఈత సరదా.. ఖమ్మం మున్నేరు వాగులో..

వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి అనేక చోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా.. మరోదాని కోసం స్థానికులు గాలిస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Khammam : ఖమ్మం నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. ధంసలాపురం వద్ద మున్నేరులో ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలు(Dead Bodies) లభ్యం అయ్యాయి. మరో బాలుడి కోసం స్థానికులు గాలిస్తున్నారు. మృతులను బాణోత్ గణేష్(14), అముదాల లోకేష్(12)గా గుర్తించారు. గల్లైంతైన బాలుడు ఆముదాల హరీష్ అని స్థానికులు చెబుతున్నారు. ఈ ముగ్గురు ఈత(Swimming) కోసం మున్నేరు వాగులో దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదు.. కోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు