Junior Doctors Strike : తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (Telangana Junior Doctors Association) బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది. దీంతో తదుపరి నోటీసు వచ్చే వరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీలతో సహా అన్ని వైద్య సేవలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు వివరించారు.
కాగా.. తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత 3 నెలలుగా స్టైఫండ్ (Stipend) ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. హౌస్ సర్జన్లు, జూనియర్ వైద్యులు, ఎస్ఆర్ లు ఇలా సుమారు 10 వేల మంది వైద్య విద్యార్థులున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్ షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు సుమారు 2,500 మంది, దాదాపు 4 వేల మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు, మరో 2 వేల మంది సీనియర్ రెసిడెంట్లు, 1,500 మంది వరకూ సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉన్నారు.
కాగా, హౌస్ సర్జన్లకు నెలకు రూ.26 వేలు, పీజీ స్పెషాలిటీ వారికి మొదటి సంవత్సరం రూ.58 వేలు, రెండో ఏడాది రూ.61 వేలు, మూడో సంవత్సరం రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు రూ.92 వేల నుంచి రూ.లక్ష వరకూ ప్రభుత్వం స్టైఫండ్ రూపంలో చెల్లిస్తోంది. అయితే, గత 3 నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నిరవధిక సమ్మె (Indefinite Strike) కు దిగుతున్నట్లు ప్రకటించారు.
Also read: జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు!