గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Group 1 exams | RTV
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Candidates appearing for Group 1 exams re-appeal about flaws in Question Paper in division bench and verdict is awaited today | RTV
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Candidates appearing for Group 1 exams re-appeal about flaws in Question Paper in division bench and verdict is awaited today | RTV
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది.
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎలెఫ్టినెంట్ గవర్నర్ ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు.
ఏపీలో ఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. మే 13 నుంచి మొదలు కావాల్సి ఉన్న ఈ సెట్ పరీక్షలను అధికారులు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ ను మే 16 న నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
సింగరేణిలో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు వరకు ఈ ఎన్నికలు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అంగీకరించిన హైకోర్టు సోమవారం ఇరువురి వాదనలు విని తుది తీర్పు వెల్లడించనుంది.
తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) వాయిదా తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే దీనికి కారణమని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ విధానంలో 6రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంపై పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.