Telangana BJP Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఎంత రంజుగా సాగిందో.. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా అంతకు మించి రక్తి కట్టిస్తోంది. ముఖ్యంగా బీజేపీలో అంతర్గ కుమ్ములాటలు.. మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన దానికంట్లే తక్కువ సీట్లు రావడంతో.. ఆ పార్టీ అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. కొన్నాళ్లుగా పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీజేపీలో ఈ విభేదాలు మరింత ముదిరాయి. ప్రస్తుతం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా పరిస్థితి మారింది. ఇరువురి వర్గాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మరోవైపు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా రఘునందన్ రావు పరోక్ష విమర్శలు చేశారు.
ఈటల రాజేందర్ వల్లే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని బండి వర్గం ఆరోపిస్తోంది. సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని వాదిస్తున్నారు. అయితే, బండి వర్గం ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది ఈటల వర్గం. బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించడం అనేది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అని చెబుతోంది ఈటల వర్గం. బండి సంజయ్ హయాంలో దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతం కాలేదని చెబుతోంది ఈటల వర్గం. టికెట్లు ఇప్పించుకున్న నేతలను సైతం బండి గెలిపించుకోలేదంటూ సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అంటూ ఇన్నేళ్లూ దూకుడు ప్రదర్శించిన బీజేపీ.. సరిగ్గా ఎన్నికల వేళ సైలెంట్ అయ్యింది. దాంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభం ఎదుర్కొంది. కనీసం 20 సీట్లు వస్తాయని అంచనా వేసినా.. డబుల్ డిజిట్ కూడా దాటలేదు. కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. వీరిలో ఒక్క రాజాసింగ్ మినహా మిగతా వారంతా కొత్తవారే కావడం విశేషం. బీజేపీలో అగ్రనేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి వారెవరూ ఈ ఎన్నికల్లో గెలుపొందలేదు.
Also Read:
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపు రెగ్యులరైజ్..
‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..