Telangana: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ పై కీలక అప్‌డేట్ .. ఆ తరువాతే ఫలితాలు! తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ వ్యాల్యుయేషన్ పూర్తైనట్లు సమాచారం. ఈనెల 20 తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 13 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ts Inter Results; ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి కూడా ఓ కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ వ్యాల్యుయేషన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరించారు. పేపర్ల పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇంకా మూడు దశల వాల్యూయేషన్ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఇంటర్ బోర్డు నెలాఖరులోపు పూర్తి చేయనుంది. దీనికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. Also read: ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల #telangana #inter-board #inter-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి