Telangana: రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి.. హరీష్ రావు సంచలన కామెంట్స్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. అసలు రేవంత్ పేరే రైఫిల్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌ది అని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంది బీఆర్ఎస్ అన్నారు.

New Update
Telangana: రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి.. హరీష్ రావు సంచలన కామెంట్స్..

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కన్నెర్రజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మూడు నిమిషాల్లోనే మూడుసార్లు మైక్ కట్ చేశారంటూ ఫైర్ అయ్యారు. క్లారిఫికేషన్‌పై అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అని ప్రశ్నించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఒకలా.. చేతలు నిరంకుశత్వంలా ఉన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఊకదంపుడు ప్రసంగాలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన ఇంకా సీఎం అయినట్లుగా భావిస్తున్నట్లు లేదని సెటైర్లు వేశారు హరీష్ రావు. సభాధ్యక్షుడిగా హుందాగా మాట్లాడుతారని భావించామని, కానీ ఏ కోశాన కూడా ఆయన అలా మాట్లాడలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు హరీష్ రావు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ఎం.ఐ.ఎం, బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ అబద్దాలను సభలో చెప్పారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేశారని విమర్శించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా తమకు అవకాశం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారని, వారి తప్పులు బయటపెడతామని ప్రభుత్వం పారిపోయిందన్నారు.

Also Read: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..

కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేపథ్యమే కుటుంబ నేపథ్యం అని విరుచుకుపడ్డారు హరీష్ రావు. దేశానికి ఎంతో మేలు చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చనిపోతే చూడని వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మాజీ ప్రధానికి ఢిల్లీలో గుంటెడు జాగ కూడా ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని, వారి తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతామో అనే భయంతో సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని విమర్శించారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానకరంగా వ్యవహరించిందో యావత్ దేశం చూసిందన్నారు. తెలంగాణ బిడ్డ టంగుటూరు అంజయ్యను మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ అవమానించారని గుర్తు చేశారు. కుటుంబ పాలనపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు హరీష్ రావు.

అమరవీరుపై రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్..

తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు హరీష్ రావు. అమరవీరులను గౌరవించింది, వారి కుటుంబాలను అక్కున చేర్చుకుందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రేవంత్ రెడ్డి పేరే రైఫిల్ రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో తుపాకీ పట్టుకుని ఉద్యమకారులపై గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది.. సమైక్య పాలకులకు తొత్తుగా వ్యవహరించింది రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. అమరవీరుల శవాలనైనా చూశావా? అంటూ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్నో ఉద్యమ కేసులు ఉన్నాయని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపాం.. అమరవీరుల స్మారక చిహ్నం కట్టాం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నాం అని చెప్పారు హరీష్ రావు.

వ్యవసాయంలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ..

తెలంగాణలో 6.59 శాతంతో వ్యవసాయ రంగంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచిందని హరీష్ రావు లెక్కలతో సహా వివరించారు. వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ అభివృద్ధి ఘనత బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని వివరించారు. మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుందని చెప్పారు. ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుందని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు హరీష్ రావు.

Also Read: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం..

Advertisment
తాజా కథనాలు