TSPSC: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. లిస్ట్ రిలీజ్! తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపునకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మహిళలకు జీవో నెంబర్ 3 ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. By srinivas 26 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపునకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మహిళలకు జీవో నెంబర్ 3 ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన చేశారు. మొత్తం 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవగా.. ఫిబ్రవరిలో పరీక్ష ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలన.. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 పరీక్షకు హాజరయ్యారు. అలాగే.. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఇదిలావుంటే.. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన వివరాలను ప్రకటించబోతున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకోసం వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించింది. https://www.tspsc.gov.in/ గ్రూప్-4 పోస్టులు జిల్లాలు, రిజర్వేషన్లు వారీగా కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. https://www.tspsc.gov.in/ #tspsc-group-4 #tspsc #telangana-group-4 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి