BIG BREAKING: గ్రూప్ - 4 ఫలితాలు విడుదల

గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్. తాజాగా గ్రూప్ -4 ఫలితాలను TSPSC విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును ప్రకటించింది. గత ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.

New Update
Lok Sabha Elections: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు రోజులు సెలవులు!

GROUP-4 Results: తమ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తాజాగా గ్రూప్ -4 పరీక్ష ఫలితాలను TSPSC విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును ప్రకటించింది. గత ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు వెబ్ సైట్ లో ర్యాంకులు చూసుకోవాలని తెలిపింది.

*WEB SITE: https://www.tspsc.gov.in/

తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి గత ఏడాది TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జులైలో గ్రూప్‌-4 పరీక్షలను నిర్వహించింది. మొత్తం 9,51,205 మంది ఈ పరీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో పేపర్-1.. 7,62,872 మంది రాశారు. పేపర్ -2... 7,61,198 మంది పరీక్ష రాశారు. TSPSC ఫైనల్ కీ కూడా విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.

Download Results Pdf

గ్రూప్​-1 వయోపరిమితి పెంపు

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్ – 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్​-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్​ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ALSO READ: టీఎస్‌ ఈ సెట్, లా సెట్ షెడ్యూల్ విడుదల

త్వరలో 15 వేల పోలీసు కొలువులు…

ఇటీవల ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 15 రోజుల్లోనే 15 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు (15000 Constable Posts)  భర్తీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 15వేల ఉద్యోగాలపై మరోసారి ప్రకటన చేశారు. తాము మాట ఇచ్చాము అంటే ఎన్ని అడ్డంకులు వచ్చిన గట్టిగ నిలబడి ఉంటామని… కచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరుతమనై తేల్చి చెప్పారు. నిరుద్యోగులు ఎవరు అధైర్య పడొద్దని భరోసా నింపారు. అధికారంలో ఉన్నది నిరుద్యోగుల, పేదల ప్రభుత్వం అని అన్నారు.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు