TGPSC Group-1 Results : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే! తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లింక్ తో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జూన్ 9న ఈ పరీక్ష నిర్వహించగా.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. By srinivas 07 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TG Group-1 : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు (Telangana Group-1 Results) విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లింక్ తో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జూన్ 9న ఈ పరీక్ష నిర్వహించగా.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ (TGPSC). ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశారు. మొత్తం 3.2 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. 31,382 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్.. ఇక పాతగ్రూప్-1 ప్రకటన రద్దుచేసిన టీజీపీఎస్సీ కమిషన్ 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొదట 503 పోస్టులతో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన వెలువడగా.. 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam) నిర్వహించగా 75 శాతం హాజరుతో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్ష రద్దయింది. దంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమినరీ నిర్వహించింది. కానీ ఈ పరీక్షకు హాజరు గణనీయంగా 61.37శాతానికి పడిపోయింది. కేవలం 2.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 ఎగ్జామ్ ను టీజీపీఎస్సీ 2024 జూన్ 9న నిర్వహించింది. ఈసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి ఏకంగా 12.63 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు. మొత్తంగా 74 శాతం హాజరు శాతం నమోదైంది. గతంలో రద్దయిన రెండు ప్రిలిమినరీ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటే సంఖ్యాపరంగా మూడు లక్షలకు మందికి పైగా అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. తాజాగా ఈ ఫిలితాలను విడుదల చేయగా.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. Also Read : హైదరాబాద్లో చంద్రబాబు భారీ ర్యాలీ #tgpsc #tg-group-1-results #tg-group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి