Telangana : ఒలింపిక్ పతకాలే లక్ష్యం.. హైదరాబాద్‌లో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ !

ఒలింపిక్స్ ఛాంపియన్స్‌ను తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ' ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించనున్న ఈ వర్సిటీలో 12కు పైగా స్పోర్ట్స్‌ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి.

New Update
Telangana : ఒలింపిక్ పతకాలే లక్ష్యం.. హైదరాబాద్‌లో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ !

Young India Sports University : తెలంగాణ (Telangana) లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ (Revanth Government) ముందడుగులు వేస్తోంది. ఒలింపిక్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు 'యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్ సిటీ)లోని స్పోర్ట్స్‌ హబ్‌లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించనున్న ఈ వర్సిటిలో 12కు పైగా స్పోర్ట్స్‌ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయి సదుపాయాలతో స్పోర్ట్స్ సైన్స్, మెడిసన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

వర్సిటీ నిర్మాణానికి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌ అలాగే గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ దక్షిణ కొరియా (South Korea) కు వెళ్లినప్పుడు 'కొరియన్ నేషనల్ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ'ని సందర్శించారు. 1976లో దాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అది ప్రపంచంలోనే ప్రఖ్యాత క్రీడావర్సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో కూడా దక్షిణ కొరియా 32 పతకాలు సాధించింది. అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన క్రీడాకారులే సాధించారు. అయితే ఇప్పుడు కొరియన్ క్రీడా వర్సిటీ.. తెలంగాణలో నిర్మించనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది.

Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

2028లో ఒలింపిక్ గేమ్స్‌ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో ఎక్కువ మంది క్రీడాకారులు రాణించే విధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీలో ఉండాల్సి మౌలిక వసతులపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రను కోరారు. అయితే భారత్‌కు ఒలింపిక్స్‌ నుంచి అంతగా పతకాలు రాలేవన్న సంగతి తెలసిందే. దీంతో ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ ఆలోచనా విధానం మారినప్పుడు ఒలింపిక్స్‌ పోటీల్లో ప్రపంచాన్ని ఓడించే ప్రతిభను ఏది అడ్డుకుంటోంది అంటూ ట్వీట్‌ చేశారు.

దీంతో ముఖ్యమంత్రి రేవంత్.. ఆనంద్ మహీంద్రా పోస్టుకు స్పందించారు. '' దేశంపై, యవతపై మీకున్న ప్రేమ, అపార నమ్మకం మీ ఆవేదనలో కనిపిస్తోంది. నేను వ్యక్తిగతంగా ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలపై పనిచేస్తున్నాను. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లాను. అక్కడ కొరియా నేషనల్ స్పోర్స్ట్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు మూన్‌ వోన్‌జే బృందాన్ని కలిశాను. హైదరాబాద్‌లో క్రీడా వర్సిటీని ఏర్పాటుకు కొరియా యూనివర్సిటీ భాగస్వామిగా ఉండటానికి అంగీకరించింది. హకీంపేట, గచ్చిబౌలిలోని 200 ఎకరాల క్యాంపస్‌లతో పాటు అన్ని క్రీడా స్టేడియాల్లో మౌలిక సదుపాయాలకు ఒలింపిక్స్ గ్రేడ్‌కు సమానంగా తీర్చిదిద్దుతామని'' రేవంత్ వివరించారు.

Also read: గుడ్‌న్యూస్.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం

Advertisment
తాజా కథనాలు