TS Farmers: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన!

రుణమాఫీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

New Update
Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్..

టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లోఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 5,089 ఉద్యోగాలపై కీలక అప్డేట్.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు వైద్య కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. గురుకులాల్లో 6.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కేటీఆర్ వివరించారు. 55ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేనిది పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. 55ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కళ్లు ఎర్రబడుతున్నాయంటూ మంత్రి ఫైర్ అయ్యారు. ఒక్కప్పుడు మైగ్రేషన్ కు కేరాఫ్ అడ్రస్సుగా ఉన్న పాలమూరు జిల్లా నేడు ఇరిగేషన్ కు కేరాఫ్ గా మారిందన్నారు. సముద్ర తీరం లేకుండా మత్స్య సంపద పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే నెంబర్ వన్ స్థానమన్నారు. రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చదవండి: షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

Advertisment
Advertisment
తాజా కథనాలు