Rythu Bandhu : తెలంగాణ(Telangana) లో రైతు బంధు(Rythu Bandhu) కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్(Revanth Sarkar) గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే రైతు బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయగా.. ప్రభుత్వ ఖజానాలో పైసలు లేక రైతు ఖాతలో డబ్బు జమ అవ్వడం ఆలస్యం అవుతుందని కాంగ్రెస్(Congress) నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రైతు బంధు నిధులకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. కేంద్రం ఇందుకోసం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
సంక్రాంతి తరువాతే..
సంక్రాంతి(Sankranti) పండుగ వచ్చిన తెలంగాణ రైతుల ముఖాల్లో సంతోషం కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం రైతు బంధు డబ్బు ఇంకా తమ అకౌంట్లో జమ కాకపోవడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రైతు బంధు నిధులు అకౌంట్లో జమ చేసే ప్రక్రియ స్పీడ్ అందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వానికి రైతుబంధు పథకం నిధులు రెండు, మూడు రోజుల్లో సర్దుబాటు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఇందులో ఈనెల 16వ తేదీన రూ. 2 వేల కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆ డబ్బును తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులకు కేటాయించనుంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే... చెల్లింపులను ప్రారంభించి, ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : నిర్లక్ష్యం ఖరీదు సస్పెన్షన్ వేటు.. పటాన్ చెరు సీఐ లాలూ నాయక్ సస్పెండ్..!!
ఒక ఎకరాలోపే..
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని గత డిసెంబరు 9వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఖజనాలో డబ్బులు నిండుకోవటంతో రైతుబంధుకు నిధులు సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. తొలుత ఒకఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050 కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల మంది ఉన్న రైతులకు ఎకరాకు రూ.5,000 చొప్పున ఇవ్వాలంటే రూ. 7,625 కోట్ల నిధులు కావాలని నివేదికలు చెబుతున్నాయి.