/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Runa-Mafi-1.jpg)
Telangana Government : రుణమాఫీ (Runa Mafi) చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఆగస్టు 15 లోపు అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తాజాగా రుణమాఫీపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే వారం నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. విడతల వారీగా రుణమాఫీ అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టింది. రుణమాఫీ మార్గదర్శకాలు రెడీ అయినట్లు సమాచారం.
సీఎం రేవంత్ (CM Revanth Reddy) దగ్గరికి అధికారులు ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేయనున్నారు. DCCB, SBI బ్యాంకుల్లో రూ. 2 లక్షల్లోపు పంట రుణం.. తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ప్రత్యేక యాప్‌లో రైతుల వివరాలు నమోదు చేశారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ అమలు కానుంది.
Also Read : మీ అహంకారం ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్