GROUP-1: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పోస్టులని పెంచింది. గ్రూప్-1లో మరో 60పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తాజాగా మరో 60 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్‌ - 1 పోస్టుల సంఖ్య మొత్తం 563కు చేరింది.

New Update
GROUP-1: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు

TSPSC Group 1 Posts Increased: గ్రూప్-1 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 పోస్టులని పెంచింది. గ్రూప్-1లో మరో 60పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) జీవో విడుదల చేసింది. డీఎస్పీ - 24, MDO - 19 , ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ - 4, ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో - 3 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని TSPSCకి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ను TSPSC ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 60 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తంగా గ్రూప్‌ - 1 కింద 563కు పెరిగిన పోస్టులు. మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ (Congress Job Calendar) ప్రకటించింది కాంగ్రెస్‌. ఫిబ్రవరి 1నే గ్రూప్‌ - 1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

ALSO READ: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం

కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే...

  •  రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’
  • వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌.. టీజీగా మార్పు
  • రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం
  • తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం
  • రూ.500 లకు గ్యాస్ సిలిండర్‌కు ఆమోదం
  • 200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు ఆమోగం
  • మూతబడ్జ నిజాం షుగర్ కార్మాగారను పునురుద్దిరించేలా నిర్ణయం
  • తెలంగాణ హైకోర్టు కోసం 100 ఎకరాలు కేటాయింపు
  • కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం
  • 65 ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం
  • సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి.. వాళ్లని విడుదల చేయడం
  • అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం.
  • ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ.
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభం

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు