Telangana: తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..

తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..
New Update

Telangana Social Security Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు(Journilist) కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరికీ రూ. 5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్‌ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ సామాజిక భద్రతా పథకం 2015లోనే అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు సామాజిక భద్రతా బీమాను వర్తింపజేశారు. అయితే, ఈ పథకాన్ని పొడిగించడంతో పాటు.. గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అయితే, ఈ ఫ్రీ బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ప్రకటించారు.

Also Read:

రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ?

వారందరికీ 6 గ్యారెంటీలు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్..

#telangana #cm-revanth-reddy #journalists
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి