Dharani Portal: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ధరణి పోర్టల్ ను సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దానికి బదులుగా భూమాత పోర్టల్ ను (Bhoomatha Portal) తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దిశగా రేవంత్ సర్కార్ (Revanth Reddy) అడుగులు వేస్తోంది. ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు, అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమించింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్‌ఏ వ్యవహరించనుంది.
ALSO READ: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ధరణి పోర్టల్ రద్దు..అందుకేనా?
ధరణి పోర్టల్ తో కేసీఆర్ కుటుంబం భూములు కట్టబెట్టుకుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కూడా ధరణిలో అడ్డగోలుగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భములని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తెలంగాణలోని భూముల రికార్డులను ఆన్లైన్ లో స్టోర్ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో దళారుల వ్యవస్థ పోతుందని.. భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా అవుతుందని అప్పట్లో కేసీఆర్ తెలిపారు. భూములు ఆన్లైన్ లో ఉండడం వల్ల కబ్జా, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని గతంలో కేసీఆర్ పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ తో రైతు బంధు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. భూమి స్థలం ఆధారంగా రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు బంధు ప్రవేశ పెట్టిన మొదటి సంవత్సరంలో ఏడాదికి ఎకరాకు రూ.8,000 ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందించింది. ఆ తరువాత ఆ ఆర్థిక సాయాన్ని ఏడాదికి ఎకరానికి రూ.10,000 చేసింది. అయితే.. ధరణిలో ఉన్న లెక్కల ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేసేది. ఇప్పుడు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఎన్నికల సమయంలో దీన్నే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ ను రద్దు చేస్తే రైతు బంధు, రైతు భీమా రద్దు చేస్తుందని ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేకపోయింది.
ALSO READ: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు