Telangana: ముందుమాట వివాదం.. విద్యాశాఖ అధికారులపై బదిలీ వేటు! పాఠ్యపుస్తకాల్లో అధికారిక మార్పులపై నిర్లక్ష్యం వహించిన విద్యాశాఖ అధికారులపై తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. డైరెక్టర్ రాధారెడ్డి, శ్రీనివాసచారిలపై బదిలీ వేటు వేసింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి వీరిద్దరినీ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. By srinivas 14 Jun 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Scool books: తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందుమాట మార్చకపోవడంతో అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. డైరెక్టర్ రాధారెడ్డి, శ్రీనివాసచారిలపై బదిలీ వేటు వేసింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించింది. టీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలవుతున్నా.. తెలుగు ఒకటవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ముందుమాట మార్చకుండా విద్యార్థులకు పంపిణీ చేయడం వివాదాస్పదమవడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలవుతున్నా.. 1 నుంచి పదో తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు, అధికారుల పేర్లే ఉండడం వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక ఇబ్బందులు.. ఈ మేరకు బుధవారం పంపిణీ చేసిన పుస్తకాలతో పాటు, ఇంకా పంపిణీ చేయకుండా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న పుస్తకాలను కూడా వెనక్కి తెప్పిస్తున్నారు. ఈ పుస్తకాల్లోని ‘ముందుమాట’లో మార్పులు చేస్తారా? లేక గత ప్రభుత్వంలోని ముఖ్యుల పేర్లున్న స్థానంలో స్టిక్కర్‌ను అతికిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ముందుమాట పేజీని తొలగించి దాని స్థానంలో మరో పేజీని అతికించడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్టు తెలుస్తోంది. ఈ ముందుమాట ఉన్న పేజీ మరోవైపు వందేమాతరం, జాతీయ గీతం ముద్రించి ఉన్నాయి. #telangana-government #education-officials #school-books మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి