/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/44-2-jpg.webp)
CEC Meeting : తెలంగాణ(Telangana) లో మిగిలిపోయిన నాలుగు ఎంపీ అభ్యర్ధుల స్థానాలను ఇవాళ ఖరారు చేసేశారు. ఢిల్లీ(Delhi) లో జరిగిన సీఈసీ(CEC) సమావేశంలో అభ్యర్ధులను నిర్ణయించారు. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న నాలుగు స్థానాలపై అభ్యర్థుల ఎంపిక చేశారు. ఏఐసిసి(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీఈసీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఇందులో నాలుగు స్థానలను అభర్యధులను ఖరారు చేయడమే కాకుండా.. రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మార్పు చేసినట్లు సమాచారం. ఇందులో సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేంద్రను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికాసేట్లో తెలంగాణలోని 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్(Congress) అధిష్టానం విడుదల చేయనుంది.
నాలుగు స్థానాల మీద ఉత్కంఠత..
లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీని కోసం మంత్రులు, సీనియర్ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తోంది. అయితే ఖమ్మం,వరంగల్,కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో పీటముడి ఉంది. ఖమ్మం స్థానం కోసం భట్టి, తుమ్మల, పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంగనగర్‌లో కూడా సీనియర్ మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల మీద ఉత్కంఠత నెలకొంది. ఇక కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన కడియంకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. అలా అయితే నాగర్ కర్నూల్ సీటు మారుస్తారని అంటున్నారు. ఈ నాలుగు సీట్ల మీద ఇంత పంచాయితీ ఉంది కనుకనే ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు.
Also Read : National: కాంగ్రెస్‌కు ఊరట..ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ