Chandrababu Tweet Over Telangana Formation day: తెలంగాణ అవిర్భవ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతాలు వేరైనా ప్రజలంతా ఒక్కేటేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ మేరకు 'రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి....సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను' అన్నారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఇరు రాష్ట్రాల ప్రజలు పాజిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు.
రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి.…
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2024