BREAKING: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా!

గులాబీ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BREAKING: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా!
New Update

Thatikonda Rajaiah Resigned to BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య వెళ్లనున్నారు. ఈ నెల 10న కాంగ్రెస్‌ పార్టీలోకి (Congress Party) ఆయన జాయిన్ అవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపారు రాజయ్య. అనుచరులు, అభిమానుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ విధి విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్టు రాజయ్య ప్రకటించారు. కాసేపట్లో కేసీఆర్ కు (KCR) ఆయన రాజీనామా లేఖను పంపించినున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నుంచే ప్రస్థానం:
రాజయ్య (Thatikonda Rajaiah) 1997 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా మారారు. 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో , అతను స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున కడియం శ్రీహరిని (Kadiyam Srihari) ఓడించి విజయం సాధించారు . 2011లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ తర్వాత అక్టోబర్ 30, 2011న ఆయన భారత రాష్ట్ర సమితి (నాటీ TRS) పార్టీలో చేరాడు. 2012 ఉపఎన్నికలలో ఆయన మరో సారి విజయం సాధించారు, ఈసారి బీఆర్‌ఎస్‌(టీఆర్ఎస్) పార్టీ ప్రతినిధిగా, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కడియం శ్రీహరి మరోసారి ఆయనకు ప్రత్యర్థిగా నిలిచారు.

ఆరోగ్యశాఖ మంత్రిగా ఫెయిల్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో స్టేషన్‌ఘన్‌పూర్‌ (Station Ghanpur) నుంచి 58,829 ఓట్ల తేడాతో మళ్లీ గెలుపొందారు. జూన్ 2 2014న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మంత్రివర్గంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. జనవరి 25, 2015న రాజయ్య పనితీరుపై ప్రతికూల నివేదికలు రావడం, తెలంగాణలో స్వైన్ ఫ్లూ నివారణ చర్యలను అమలు చేయడంలో వైఫల్యం కారణంగా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిగా (Health Minister) తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ, రాజయ్య 2018 అసెంబ్లీ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మరో విజయాన్ని సాధించారు. ఇది ఆ నియోజకవర్గంలో వరుసగా నాలుగో విజయం. ఇక 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించింది.

Also Read: సచినే హీరో.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

#brs #congress #ponguleti-srinivas-reddy #thatikonda-rajaiah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe