Telangana: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం..

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. తుంటి ఎముక మార్పిడీ చికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం ఇప్పుడు కుదురుకుంటోంది. తాజాగా కేసీఆర్‌తో నడిపించే ప్రయత్నం చేశారు వైద్యులు. కేసీఆర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Telangana: ఆస్పత్రిలో కేసీఆర్ ఎలా నడుస్తున్నారో చూడండి.. వీడియో మీకోసం..
New Update

BRS President KCR: బాత్రూమ్‌లో కాలు జారి కింద పడిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. యశోద ఆస్పత్రిలో ఆయనకు శుక్రవారం నాడు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయనతో వైద్యులు కాసేపు నడిపించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడివి వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ తో మెల్లగా అడుగులు వేయిస్తున్న యశోద ఆస్పత్రి వైద్యులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్.. ప్రగతి భవన్‌ను వీడి ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు షిఫ్ట్ అయ్యారు. అయితే, గురువారం అర్థరాత్రి బాత్రూమ్‌కి వెళ్లిన సమయంలో కాళ్లకు పంచ అడ్డు తగలడంతో కేసీఆర్ కింద పడిపోయారు. ఆ సందర్భంగా ఆయన ఎడమ కాలి తుంటి భాగంలో గాయమైంది. వెంటనే యశోద ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు జరిపారు. ఆయన తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. శుక్రవారమే ఆయన తుంటి ఎముక మార్పిడి చికిత్స చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆపరేషన్ చేశారు. అప్రస్తుం ఆయన ఐసీయూలో ఉన్నారు. కేసీఆర్‌ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనను నడిపిస్తున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

#telangana #brs-party #ex-cm-kcr #kcr-injury
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe