KCR to Telangana Bhavan Today : బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఇవాళ(ఫిబ్రవరి 6) తెలంగాణ భవన్(Telangana Bhavan) కు రానున్నారు. పార్టీ నేతలలో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) సన్నాహకాలపై నేతలతో మాట్లాడనున్నారు. సెంట్రల్ నల్గొండ జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారంలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది.
కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీ గురించి ప్రజలకు వాస్తవాలను వివరించి కృష్ణా నీటిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కులు కల్పించేందుకు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది. నల్లగొండ జిల్లా నుంచి కేఆర్‌ఎంబీ సమస్యపై పోరాటానికి బీఆర్‌ఎస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ బహిరంగ సభ గురించి పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సభ విజయవంతం అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
శస్త్రచికిత్స విజయవంతం తర్వాత స్లో స్లోగా రాజకీయాల్లోకి యాక్టివ్ అవుతున్నారు గులాబీ బాస్. గత గురువారం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు . అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజులకే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారు. దీంతో ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అందుకే అందరితో పాటు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. దాదాపు ఆరు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తర్వాత సమావేశమైన BRS లెజిస్లేచర్ పార్టీ, ఆయన గైర్హాజరీలో ఆయనను పార్టీ నాయకుడిగా ఎన్నుకుంది. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు.
Also Read: టి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!!
WATCH: