Telangana : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు

తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ మారింది. జూన్ 27 నుంచి జరగాల్సిన ఈ ప్రక్రియ జూలై 4కు వాయిదా పడింది.

Telangana : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు
New Update

Engineering Counselling : తెలంగాణ (Telangana) లో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో (Private Engineering Colleges) సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. జూన్ 27న జరగాల్సిన ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీనిని జూలై 4 నుంచి ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, జులై 8 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం, జులై 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

దీని తర్వాత జులై 26 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ (Engineering Counselling) నిర్వహించి.. జులై 27న రెండో విడత కౌన్సెలింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపడతారు. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 31న ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి ఆ తర్వాత ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 9న మూడో విడత కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టి.. 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 13న ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు అవకాశం ఇస్తారు.

Also Read:Kejriwal: తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

#telangana #students #engineering-counselling
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe