Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్!

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే చేయాలనుకుంటే.. ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాల్లో ఎవరూ జైలు నుంచి బయటకు రాకపోయేవారని వ్యాఖ్యానించారు.

New Update
Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Minister Harish Rao Comments on Chandrababu Arrest: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ అయితే.. మిగతా పార్టీలకంటే ముందు వరుసలో దూసుకుపోతుంది. ఓవైపు సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు జోడు గుర్రాల్లా మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao).. అటు పర్యటనలతో పాటు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి 100 స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కాంగ్రెస్‌ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu Arrest) సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉండటంపై స్పందించిన హరీష్ రావు.. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఈ కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే గనుక ఇలాంటి రాజకీయాలు చేయానలుకుంటే.. ఎంతోమంది జైళ్లలో ఉండేవారన్నారు. ఎన్నో చేస్తుండేవాళ్లమన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును, రేవంత్ రెడ్డిని ఈపాటికి ఎన్నోసార్లు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టపగలు, డబ్బు సంచులతో సహా వీడియోలతో సహా దొరికిపోయినా కూడా కేసు పెట్టి చట్టానికి వదిలేశాం తప్ప.. వ్యక్తగత కక్షతో వ్యవహరించలేదని తెలిపారు మంత్రి హరీష్ రావు. 'ప్రత్యర్థులను జైల్లో వేయాలి.. వారిని బయటకు రానీయొద్దని.. అధికారం తమ చేతిలో ఉంది.. అని ఎలాంటి పిచ్చి పనులు అయితే చేయలేదు' అని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్ రావు. అసలు ఆ ఆలోచనే చేయలేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ అంతా కూడా తెలంగాణ అభివృద్ధిపైనే ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ.. 'మా రాష్ట్ర ఎలా బాగుపడాలి, మా ప్రజలు ఎలా బాగు పడాలి, మా పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి, ఉద్యోగ కల్పన ఎలా, రైతులు ఎలా బాగుపడాలి, వైద్య రంగాన్నికి ఏం చేయాలి, విద్యా రంగాన్ని ఎలా చూడాలి' అనే అంశాలపైనే ఆలోచించేవారని, ఆ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఇంత త్వరగా డెవలప్‌ అయిందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు