తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటింగ్.. ఓటు ఎలా వేస్తున్నారో వీడియో చూడండి!

తెలంగాణలో ఇంటింటి ఓటింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 12 పోలింగ్‌ బృందాలను రంగంలోకి దింపగా సోమవారం ఒక్కరోజు 371 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.

New Update
తెలంగాణలో మొదలైన ఇంటింటి ఓటింగ్.. ఓటు ఎలా వేస్తున్నారో వీడియో చూడండి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) భాగంగా ఇంటింటి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 12 సంఘాలకు ఇంటినుంచే ఓటు వేసే కొత్త విధాన్ని ఎన్నికల సంఘం (Election Commission) సోమవారం మొదలుపెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈ ప్రక్రియను ప్రారంభించగా ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లిలోనూ ఇంటి నుంచే వయోవృద్ధులు తమ ఓటు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 12 పోలింగ్‌ బృందాలను రంగంలోకి దింపగా సోమవారం ఒక్కరోజు 371 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

!

Also read :చిరు పేరుతో క్రాఫ్‌పై స్పందించిన వైష్ణవ్‌ తేజ్.. అదొక చేదు జ్ఞాపకం అంటూ

ఇక తెలంగాణలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం మొత్తం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం మాత్రమే అవకాశం కల్పించారు. వీరంతా ఓటు వేసే తేదీని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నిర్ణయించగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్‌ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించారు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మంది, బాల్కొండ 707, సత్తుపల్లి 706, పెద్దపల్లి 640, బహుదూర్‌పురా 11 మంది, అలంపూర్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది. తొలిరోజు 371 మంది వృద్ధులు, వికలాంగులు 12డీ ఫారంలను బీఎల్వోలకు సమర్పించి ఓటు వేశారు. అత్యంత పకడ్బందీగా సాగిన ఈ ప్రక్రియను నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఆర్వో) శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఏఆర్వో రజనీకాంత్‌రెడ్డి, ఇతర అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొనగా మంగళవారం కూడా కొనసాగనున్నది.

Advertisment
Advertisment
తాజా కథనాలు