Telangana Elections: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ వెయిటింగ్? సీక్రెట్ ఇదేనా!

అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హైడ్ సీక్ గేమ్ కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ లిస్ట్‌ పైనే బీజేపీ ఆశగా ఎదురు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో పేరు లేని నాయకులు.. ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అందుకే.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ ఎదురు చూస్తోందని టాక్.

Telangana Elections: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ వెయిటింగ్? సీక్రెట్ ఇదేనా!
New Update

Telangana Elections: తెలంగాణలో ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ(BRS) ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజా ఆశీర్వాదం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ, ఈ సారి అధికారం మాదే అంటున్న కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక వద్దనే నిలిచిపోయాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త బెటర్ ప్లేస్‌లో ఉన్నా.. బీజేపీలో మాత్రం ఆ ఊసే కనిపించడం లేదు. రేపో, మాపో ప్రకటిస్తామని చెబుతున్నారు కానీ.. అలాంటి పరిస్థితి అయితే ఏదీ కనిపించడం లేదు. అయితే లిస్ట్ ఆలస్యానికి కాంగ్రెస్‌ కారణం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ లిస్ట్‌కి సంబంధం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును, ఇక్కడే అసలు ట్విస్ట్. దాన్ని బేస్ చేసుకునే బీజేపీ తన అభ్యర్థుల ప్రకటనపై ఒక అడుగు వెనక్కే ఉంది.

మరి బీజేపీ లిస్ట్ ఆలస్యానికి కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌కు సంబంధం ఏంటో ఓసారి చూద్దాం..

తెలంగాణలో ఎన్నికలకు మరెంతో కాలం లేదు. సరిగ్గా 40 రోజుల సమయం మిగిలి ఉంది. కానీ, కాంగ్రెస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయనేలేదు. మరి ఈ పార్టీలు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి.. ఎప్పుడు ప్రచారం నిర్వహించాలి అనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే, అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హైడ్ సీక్ గేమ్ కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ లిస్ట్‌ పైనే బీజేపీ ఆశగా ఎదురు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడుదల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో పేరు లేని నాయకులు.. ఎంత రచ్చ చేస్తున్నారో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. సీటు దక్కని అసంతృప్త నేతలు.. ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ప్రకటనలు కూడా చేశారు. ఇక రెండవ లిస్ట్ వస్తే పరిస్థితి ఇంకా ఏం రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇదికూడా చదవండి: Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

అయితే, బీజేపీకి కావాల్సింది ఇదేనని పొలిటికల్ సర్కిర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును, కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అయితే.. అందులో సీటు దక్కని వారు తప్పనిసరిగా చిన్నపాటి యుద్ధమే చేస్తారు. ఆ అసంతృప్తితో వారు కాంగ్రెస్‌ను వీడే అవకాశం ఉంటుంది. అలా కాంగ్రెస్‌ను వీడే ముఖ్య నాయకులను తమ వైపు లాగేసి.. స్ట్రాంగ్ లీడర్ అయితే వారికి సీటు ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసంతృప్త నేతలను బీజేపీ వైపు లాగేస్తే.. ప్రయోజనం ఉంటుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోందట. అందుకే బీజేపీ లిస్ట్ ప్రకటన ఆలస్యమవుతోందని రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ సాగుతోంది.

40 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్..

కాగా, ఇప్పటికే 40 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ను సిద్ధం చేసిందట. మిగతా చోట్ల సరైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోందట. ఇక అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అభ్యర్థుల ఎంపికపై రాత్రి ఫైనల్ చేసి.. గురువారం రోజున 40 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని పార్టీల నుంచి సమాచారం అందుతోంది. మిగతా అభ్యర్థుల పేర్లు అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తరువాతే అని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతనిజం ఉందనేది తెలియాలంటే.. లిస్ట్ ఔట్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.

ఇదికూడా చదవండి: మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

#telangana-elections #bjp #bjp-mla-list #telangana-polls-2023 #congress-list #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి