Amit Shah Telangana Tour: తెలంగాణ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ(BJP) ప్రభుత్వం. ప్రచారంతో హోరెత్తించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఇవాళ బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. గద్వాల, నల్లగొండ, వరంగల్‌లో అమిత్ షా పర్యటిస్తారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అమిత్ షా షెడ్యూల్ వివరాలివే..
అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.50కి గద్వాల చేరుకుంటారు.
1.35 నిమిషాల వరకు గద్వాల సభలో పాల్గొంటారు.
1.45కు గద్వాల నుంచి నల్లగొండ బయలుదేరుతారు కేంద్ర హోం మంత్రి.
2.45కు నల్లగొండ చేరుకుంటారు అమిత్ షా.
3.35 వరకు నల్లగొండ సభలో పాల్గొంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
3.40 కి నల్లగొండ నుంచి బయలుదేరి 4.20 వరకు వరంగల్ చేరుకుంటారు అమిత్ షా.
4.25 నుంచి 5.05 నిమిషాల వరకు వరంగల్ సభలో పాల్గొంటారు కేంద్ర హోం మంత్రి.
6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
6.10 గంటలకు హోటల్ కత్రీయలో మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు అమిత్ షా.
6.45 నుంచి 7.45వరకు క్లాసిక్ గార్డెన్‌లో MRPS సమావేశంలో పాల్గొంటారు.
సాయంత్రం 7.55 కి బేగం పేట విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ బయలుదేరుతారు అమిత్ షా.
Also Read:
ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..
రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!