TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..!

TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..!
New Update

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుడగా.. మరోవైపు ప్రచారాలు, బహిరంగ సభలతో నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అన్నిటికంటే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నది మాత్రం సభలు, సమావేశాలు, మాటల తూటాలపై కాదు.. ఏ నేతకు ఎంత ఆస్తి ఉంది..? వారిపై ఎన్ని క్రిమినల్‌ కేసులున్నాయి? ఈ ఐదేళ్లలో ఎంత సంపాదించారు? ఇందులో మా ఎమ్మెల్యే ఆస్తులు విలువ ఎంత? లాంటి వాటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

ఎన్నికల అఫిడవిట్‌లో నేతలు సమర్పించిన ఆస్తుల వివరాలపై ఓ లుక్కేయండి:

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆస్తుల విలువ ఈ ఐదేళ్లలో రూ.5కోట్లు పెరిగింది. రేవంత్‌, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.30కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.25 కోట్లగా ఉంది. ఇక రేవంత్‌పై 87 క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇందులో సగం కంటే ఎక్కవ ఈ నాలుగేళ్లలోనే నమోదయ్యాయి. వీటిలో చాలా కేసులు ఆయన పోలీసులపై చేసిన ఆరోపణలపైనే రిజిస్టరై ఉన్నాయి. మరోవైపు బండి సంజయ్‌కు సొంతిల్లు కూడా లేదు.ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ ఎక్కడా భూమి లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన ఆస్తుల వలువ రూ.79 లక్షలగా పొందుపరిచారు. వీటిలో చాలా వరకు కార్లు, బంగారం, వెండి లాంటివి ఉన్నాయి. సొంతిల్లు లేని రాజకీయ నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. అటు సంజయ్‌పై 27 క్రిమినల్‌ కేసులున్నాయి. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో ఆయనపై 5 కేసులే ఉండగా.. ఇప్పుడా సంఖ్య27కు పెరిగింది. వీటిలో చీటింగ్‌ కేసులు కూడా ఉన్నాయి.

publive-image ఎర్రబెల్లి దయాకర్‌ రావు

ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆస్తులు ఎంత పెరిగాయంటే?

అటు పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన భార్య ఆస్తుల విలువ 58శాతం పెరిగినట్లు అఫిడవిట్‌ లెక్కలు చెబుతున్నాయి. ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.12.8కోట్లు. ఇందులో స్థిరాస్తుల విలువ ఏకంగా రూ.11.3 కోట్లు. గతేడాది ఆయన ఇన్‌కమ్‌ రూ.24లక్షలగా ఉంది. 2018లో ఎర్రబెల్లి, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.8.1కోట్లగా ఉంది. అటు కాంగ్రెస్‌ రెబల్‌ పరిజాత, ఆమె భార్య స్థిరాస్తుల విలువ రూ.16.6 కోట్లగా ఉంది. ఇటు బీఆర్‌ఎస్‌ ఇబ్రహింపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.98కోట్లగా ఉంది. ఇటు గద్దర్‌ కుమార్తె, ఆమె భర్త ఆస్తుల విలువ రూ.58లక్షలగా పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌(cont) నుంచి నామినేషన్ వేశారు. ఇక AIMIM అభ్యర్థి ఆస్తుల విలువ రూ.33.2 కోట్లగా ఉండగా.. అటు కల్వకుర్తి నుంచి పోటి చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆస్తుల విలువ రూ.36.5 కోట్లగా ఉంది.

Also Read: ఈ జనరేషన్ సినీ ప్రపంచానికి అతనొక టార్చ్ బేరర్

WATCH:

#telangana-elections-2023 #revanth-reddy #bandi-sanjay
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe