BRS Manifesto: ఇవాళ బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్‌ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్‌. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

New Update
BRS Manifesto: ఇవాళ  బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్‌ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్‌..!

తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సీఎం కేసీఆర్‌(CM KCR) ఇవాళ(అక్టోబర్ 15) హుస్నాబాద్‌కి వెళ్తున్నారు. లక్షల మంది బీఆర్‌ఎస్‌(BRS) కార్యకర్తల మధ్య ప్రసంగించనున్నారు. 2014లోనూ, 2018 ఎన్నికలకు ముందు కూడా సీఎం హుస్నాబాద్‌(Husnabad) నుంచే ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఈ రెండు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులను మట్టికరిపించింది. అందుకే అదే సెంటిమెంట్‌ను కేసీఆర్‌ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. హుస్నాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇది ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్ చేసిన తర్వాత కేసీఆర్‌ పాల్గొంటున్న తొలి ప్రచార సభ. దీంతో ఈ మీటింగ్‌ను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు రెడీ అయ్యారు. లక్షల మంది జనసమీకరణ చేసినట్టుగా తెలుస్తోంది.

మ్యానిఫెస్టో రిలీజ్:
మరోవైపు హుస్నాబాద్‌లో కేసీఆర్‌ పాల్గొననున్న 'ప్రజా ఆశీర్వాద సభ'కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభాస్థలితో పాటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హెలిప్యాడ్‌ను సీపీ శ్వేత పరిశీలించారు. ఇక హుస్నాబాద్‌ మీటింగ్‌కు ముందు కేసీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ్యానిఫెస్టోను విడుదల చేసి అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తార. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులకు కేసీఆర్‌ కీలక సూచనలు చేస్తారని సమాచారం. ఇక పార్టీ పెండింగ్‌లో ఉంచిన జనగాం, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్, మల్కాజిగిరి లాంటి ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అటు మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో మల్కాజిగిరి స్థానానికి మర్రి రాజశేఖర్‌రెడ్డి ముందుంటారని భావిస్తున్నారు.

పది మంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ?
ఇవాళ కేసీఆర్ అభ్యర్థులకు బీ ఫారమ్‌లు అందజేయనుండడంతో ఉత్కంఠ నెలకొంది. పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం 10మంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల నుంచి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. అసమ్మతి నేతలను సంతృప్తిపరిచేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు బదులు మరొకరికి టికెట్ ఇవ్వాలంటూ స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇవ్వొద్దని.. పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి డిమాండ్ చేశారు. ఇటీవల మెదక్ అసెంబ్లీ నియోజవర్గంలో కూడా ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ అసమ్మతి నేతలు ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కూడా టికెట్ ఇవ్వకూడదని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. స్టెషన్‌ఘన్‌పూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు.

ALSO READ: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు