'గుద్దుడు గుద్దుతే బాక్సులు బద్దలు గావాలే...' సోషల్‌మీడియాలో ప్రత్యర్థి పార్టీలను బీఆర్‌ఎస్ మాములుగా గుద్దడం లేదు.. ఎక్కడ చూసినా గులాబీల జాతరే కనిపిస్తోంది. అమెరికా నుంచి మారుమూల పల్లెల వరకూ... ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్ గులాబీ జెండా పాటే వినిపిస్తోంది. కాదు..కాదు.. అలా వినిపించేలా చేసింది గులాబీ పార్టీ. సోషల్‌మీడియాను ఎన్నికల ప్రచారానికి బీఆర్‌ఎస్ వాడుకుంటున్నంత తెలివిగా తెలంగాణలో మరే పార్టీ కూడా యూజ్ చేయడంలేదు. గంటల కొద్దీ ప్రసంగాలు వినే ఓపిక, తీరిక ప్రజలకు ఉండదు.. అందుకే పాటల రూపంలో, షార్ట్స్‌లో, రీల్స్‌లో సోషల్ రీల్స్‌ను ప్రచారాన్ని నిర్వహిస్తోంది కారు పార్టీ. అరగంట పాటు నేతలు ఇచ్చే స్పీచ్ కంటే ఫేస్‌బుక్ పేజీలో వేసే ఒక మీమ్‌కు రీచ్ ఎక్కువ ఉంటుంది. జనాల్లోకి ఈజీగా వెళ్తుంది. ఓవైపు ట్రెడిషనల్‌గా బహిరంగ సభలు నిర్వహిస్తూనే మరోవైపు సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది బీఆర్‌ఎస్.
గంగవ్వతో కేటీఆర్ వంట:
కేటీఆర్ వంట చేస్తున్నారు.. ఇన్‌స్టాలో ఆటపాటల వీడియోలు షేర్ చేస్తున్నారు.. పొలిటికల్ ఎనలిస్ట్‌లతో, విద్యావేత్తలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వారి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు చెబుతూ.. తద్వారా ప్రజల్లో ఉన్న డౌట్సౌ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ స్టార్ గంగవ్వతో పాటు వంట చేసి.. ఆమొతో పొలిటికల్ ముచ్చట పెట్టారు కేటీఆర్. ఆ వీడియలో సోషల్ మీడియాలో దుమ్ములేపింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న లాస్య, దీప్తి సునైనా, సావిత్రి, భానుశ్రీ.. ఇలా చాలామంది సెలబ్రెటీలు 'గులాబీల జాతర' పాటకు స్టెప్పులేస్తున్నారు. వాటిని కేటీఆర్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియా సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది.
ఎనలిస్ట్‌లతో డిబెట్స్:
మరోవైపు రాజకీయ విశ్లేషకులతో పాటు విద్యావేత్తలతో కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ గా, లోక్ సత్తా నేతగా ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్న జయ ప్రకాశ్ నారాయణకు కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. తెలివిగా ఈ ఇంటర్వ్యూను అన్నిఛానెల్స్‌లోనూ టెలికాస్ట్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్. ఇంకా.. తెలుగునాట టాప్ ఎనలిస్ట్ లలో ఒకరైన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ విజయాలు, వైఫల్యాలపై ప్రొఫెసర్ ఎన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగినా వాటికి తనదైనశైలిలో సమాధానం చెబుతూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఈ ఇంటర్వ్యూ కూడా దాదాపు అన్ని ఫేమస్ ఛానల్స్ లలో ట్రెండింగ్ గా మారింది.
కొత్త ఓటర్ల కోసమేనా?
నిజానికి పొలిటికల్ కామెంట్స్, వ్యక్తిగత బ్లాగ్స్‌లో పెట్టే ఫొటోలు-వీడియోలు, వ్యక్తిగత ఖాతాల నుంచి పోస్ట్ చేసే వాటిని పొలిటికల్ యాడ్స్ లిస్ట్‌లో ఉండవు. ఇది ఎవరి వ్యక్తిగత ఇంట్రెస్టులకు తగ్గట్టుగా వాళ్లు పోస్ట్ చేసుకోవచ్చు. దీనికి ప్రీ-సర్టిఫికేషన్ అవసరం లేదు. ఓవైపు బీఆర్‌ఎస్ సోషల్‌మీడియాను పేకాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ ఆచుతుచీ బ్యాటింగ్ చేస్తోంది. ఇంకొవైపు బీజేపీ సోషల్ గ్రౌండ్‌లోకి అయితే దిగింది కానీ ఇంకా బ్యాట్ పట్టుకోలేదు. బీఆర్‌ఎస్ ఈ విధంగా సోషల్‌లో హైపర్ యాక్టివ్‌గా ఉండడానికి బలమైన కారణం కనిపిస్తోంది. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్‌మీడియా బెటర్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో ఈసారి 9 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు సమాచారం. అటు 20 నుంచి 29ఏళ్ల మధ్య వారి ఓటర్ల సంఖ్య 62 లక్షలుగా ఉంది. వీరిలో మెజార్టీ మంది సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారే ఉంటారు. వాటిలో వచ్చే న్యూస్‌లు చదువుతుంటారు. వీడియోలు, రీల్స్, షార్ట్స్ చూస్తుంటారు. ప్రసంగాల ద్వారా కంటే వీరిని ఆకర్షించడానికి సోషల్‌మీడియానే బెస్ట్ ఆప్షన్ అని బీఆర్‌ఎస్ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే సోషల్‌మీడియాలో గులాబీ పార్టీ తగ్గేదేలా అంటోంది. నవంబర్ 30న గుద్దుడే గుద్దుడు అంటూ ప్రచారం చేస్తోంది.
Also Read: జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్.. ఎలానో తెలుసుకోండి!
WATCH: